తేది:18-01-2026 వరంగల్ జిల్లా TSLAWNEWS
వడ్డేపల్లి రిపోర్టర్ కందాల శ్రీకాంత్ గౌడ్.
వరంగల్ జిల్లా: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కీ. శే. నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా హనుమకొండ పోలీస్ హెడ్ క్వాటర్స్ వద్ద గల ఎన్టీఆర్ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.ఈ సందర్భంగా వారుమాట్లాడుతూ
తెలుగుదేశం పార్టీని స్థాపించి దేశ నలుమూలల తెలుగు వాడి ఘనతను చాటి చెప్పిన ఘనత ఎన్టీ రామారావు గారిది.ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులను అరిగోసలు పెడుతుంటే
పేద ప్రజల కోసం రైతుల కోసం రకాలను మాఫీ చేశాడు, నూతన మండలాలను ఏర్పాటు చేశాడు మహిళల కోసం డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేశాడు దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా వృద్ధులకు పెన్షన్ ఇచ్చే పథకం ప్రవేశపెట్టారు.పేదల కోసం 2రూపాయలకు 1కిలో బియ్యం పంపిణీ చేసిన మహానుభావుడు ఎన్టీఆర్ గారు.నేను ఈరోజు రాజకీయంలో ఎదగడానికి గల కారణం ఆయన స్ఫూర్తి
ఎన్టీ రామారావు గారే నా మార్గదర్శకులు నా గురువు
తెలుగు భాషకు, సంస్కృతికి జాతీయ గౌరవం తెచ్చిన వారు,రాష్ట్రాల హక్కుల కోసం కేంద్రానికి ఎదురుగా నిలిచిన ధైర్యశాలిప్రాంతీయ పార్టీని జాతీయ స్థాయిలో ప్రధాన ప్రతిపక్షంగా నిలబెట్టిన చరిత్ర ఆయనది.తెలుగు ప్రజల ఔన్నత్యాన్ని దేశంలో తారాస్థాయిలో నిలిచిన ఘనత ఎన్టీ రామారావు గారిది తెలుగు ప్రజలకు భారతదేశానికి ఆదర్శపాయులు మన ఎన్టీ రామారావు గారు అని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.