తేది:18-01-2026 TSLAWNEWS జగిత్యాల్ జిల్లా రాయికల్ మండలం రిపోర్టర్ అనుమల్ల రాజ్ కుమార్.
జగిత్యాల జిల్లా: రాయికల్ పట్టణానికి చెందిన సామల్ల సంజీవ్ జీర్ణ సంబంధిత అనారోగ్యంతో బాధపడుతూ వైద్యం చేసుకొనే ఆర్థిక స్తోమత లేని పరిస్థితుల్లో రాయికల్ మాజీ వైస్ చైర్మన్ గండ్ర రమాదేవి అచ్యుత రావు జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ దృష్టికి సంజీవ్ అనారోగ్య పరిస్తితి తీసుకురాగా
నిమ్స్ లో చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా 2 లక్షల రూపాయల ఎల్ఓసిని వారి కుటుంబ సభ్యులకు జగిత్యాల పార్టీ కార్యాలయంలో అందజేసిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వెంట నాయకులు గట్టు సతీష్ క్యాదసు నాగయ్య ముస్కు నారాయణ రెడ్డి అజారీ వినోద్ రాజేష్ తదితరులు ఉన్నారు.