ఇటీవలే బాలయ్యతో ‘భగవంత్ కేసరి’ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు అనిల్ రావిపూడి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. అయితే తాజాగా అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయనున్నాడనే టాక్ ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. ఆయన చిరుకి ఒక కథను వినిపించడం.. ఆ కథ నచ్చడంతో చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడం జరిగిందని అంటున్నారు. ప్రస్తుతం శ్రీవశిష్ఠ సినిమా కోసం రెడీ అవుతున్న చిరంజీవి, ఆ తరువాత అనిల్ రావిపూడి సినిమా చేయనున్నారని టాక్.