తేది:18-01-2026 TSLAWNEWS జగిత్యాల జిల్లా
ఇబ్రహీంపట్నం మండల రిపోర్టర్ రాడే శ్రీనివాస్.
జగిత్యాల జిల్లా :ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన కింద రూ. 3.83 కోట్లతో చేపట్టిన ఇబ్రహీంపట్నం ఫకీర్ కొండాపూర్ రోడ్డు పనులు రెండు నెలల్లో పూర్తి కానున్నాయని బీజేపీ మండల అధ్యక్షుడు బాయి లింగారెడ్డి తెలిపారు. ఆదివారం ఎంపీ ధర్మపురి అరవింద్ ఆదేశాల మేరకు ఆయన పనులను పరిశీలించారు.ఈ సందర్భంగా. మాట్లాడుతూ ఈ రహదారితో యామపూర్, ఫకీర్ కొండాపూర్ గ్రామాల రవాణా కష్టాలు తీరుతాయన్నారు. అలాగే ఇబ్రహీంపట్నం నుండి కోమటి కొండాపూర్ రోడ్డును కూడా ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన లో చేర్చాలని ఎంపీని కోరగా ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు రణధీర్, వెంకటేష్ యాదవ్, శ్రీధర్ రెడ్డి, రాజారెడ్డి, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.