పారదర్శకంగా మెదక్ జిల్లా మున్సిపల్ వార్డు రిజర్వేషన్ల ఖరారు – రాజకీయ పార్టీల సమక్షంలో ప్రక్రియ.

తేది:18-01-2026 TSLAWNEWS మెదక్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తోట అభిలాష్.

మెదక్ జిల్లా: రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా మెదక్ జిల్లాలోని మున్సిపల్ వార్డుల రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియను పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఈ ప్రక్రియను శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పారదర్శకంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా మెదక్ మున్సిపాలిటీలో 32 వార్డులు, నర్సాపూర్ మున్సిపాలిటీలో 15 వార్డులు, తూప్రాన్ మున్సిపాలిటీలో 16 వార్డులు, రామాయంపేట మున్సిపాలిటీలో 12 వార్డులకు రిజర్వేషన్లు ఖరారు చేశారు.
బీసీ డెడికేషన్ కమిషన్ మార్గదర్శకాలు, 2011 జనగణన ఆధారంగా ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు, అలాగే జీఓ నం.9 ప్రకారం మహిళా రిజర్వేషన్లను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో లాటరీ విధానం ద్వారా కేటాయించినట్లు కలెక్టర్ వివరించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలను పూర్తిగా అనుసరించి రిజర్వేషన్లు కేటాయించామని ఆయన స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నాగేశ్, ప్రత్యేక అధికారి సంధ్య, ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *