
తేది:17- 01- 2026 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి.
జగిత్యాల జిల్లా: జగిత్యాల జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలకు సంబంధించిన ఎన్నికల రిజర్వేషన్ ల కార్యక్రమాన్ని శనివారం జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా రిజర్వేషన్ ల కార్యక్రమం నిర్వహించారు. దీనిప్రకారం కౌన్సిలర్ పదవులకు రిజర్వేషన్లు ఎస్టీ, ఎస్సీ, బీసీ మరియు జనరల్ కేటగిరీల వారిగా ఖరారు చేశారు. తదనంతరం మహిళలకు కేటాయించిన రిజర్వేషన్లను డ్రా పద్దతి ద్వారా ఖరారు చేశారు. ఈ కార్యక్రమానికి రాజకీయ పార్టీల ప్రతినిధులు మరియు సంబంధిత అధికారులు హాజరయ్యారు.
ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ:
ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అందరూ సహకరించాలని కోరారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా మున్సిపాలిటీల రిజర్వేషన్ లు ఖరారు చేశామని మరియు మహిళా రిజర్వేషన్ లు డ్రా పద్దతి ద్వారా ఖరారు చేశామని తెలిపారు. ఈ రిజర్వేషన్ ల కార్యక్రమం పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించామని తెలిపారు. ఎన్నికల ప్రక్రియ మొత్తం సజావుగా సాగేలా రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారులు, మరియు ప్రజలు సహకరించాలని కోరారు. రిజర్వేషన్ ల వివరాలను అధికారికంగా నమోదు చేసి, ప్రజలకు అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి. రాజ గౌడ్, మున్సిపల్ కమిషనర్ లు, ప్రత్యేక అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు మరియు తదితరులు పాల్గొన్నారు.