బీఆర్ఎస్ నేతలతో కేటీఆర్ కీలక భేటీ.. కేసీఆర్ ఎక్కడ..?

తెలంగాణలో ఎన్నికల ఫలితాల వెలువడిన తర్వాత సీఎం కేసీఆర్ ఎక్కడా కనిపించలేదు. కాంగ్రెస్ కు ఘన విజయం సాధించగానే సీఎం పదవికి కేసీఆర్ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను తన ఓఎస్డీ ద్వారా పంపించారు. ఆ తర్వాత ఆయన సిద్దిపేట జిల్లాలోని ఎర్రవల్లి ఫాంహౌస్ కు వెళ్లిపోయారని ప్రచారం జరుగుతోంది.

 

తాజాగా హైదరాబాద్ లోని పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ ముఖ్య నేతల సమావేశమయ్యారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అధ్యక్షతన ఈ భేటీ కొనసాగుతోంది. ఈ సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు పాల్గొన్నారు. ఎన్నికల ఫలితాలు, భవిష్యత్‌ కార్యాచరణపై చర్చిస్తున్నారు.

 

బీఆర్ఎస్ ఓటమి తర్వాత జరుగుతున్న ఈ సమావేశానికి పార్టీ అధినేత కేసీఆర్ రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇక పార్టీ బాధ్యతలు తనయుడు కేటీఆర్ కే అప్పగిస్తారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *