దేశీయంగా 2017 జూలై 1 నుంచి పన్నుల వ్యవస్థలో సంస్కరణలు అమల్లోకి వచ్చినప్పటి నుంచి పెరుగుతూ వచ్చిన జీఎస్టీ వసూళ్లు.. ఈ ఏడాది సగటున రూ.1.66 లక్షల కోట్ల వసూళ్లు జరుగుతున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. లోక్‌సభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు రాతపూర్వక సమాధానమిస్తూ నిర్మలమ్మ ఇలా చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సగటున ప్రతి నెలా రూ.1.50 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు జరుగుతున్నాయన్నారు.