Arrive Aliveతో రోడ్లపై కఠిన నిబంధనలు — హెల్మెట్ లేకపోతే ఫైన్‌తో పాటు లైసెన్స్ రద్దు.

తేది:16-01-2026 TSLAWNEWS మెదక్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తోట అభిలాష్.

మెదక్ జిల్లా: పోలీస్ కార్యాలయంలో Arrive Alive రోడ్డు భద్రతా కార్యక్రమంలో భాగంగా“No Helmet – No Entry” నిబంధనను కఠినంగా అమలు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు ఐపీఎస్ గారు తెలిపారు.
ఈ కార్యక్రమం ద్వారా రోడ్డు ప్రమాదాలను తగ్గించి, ముఖ్యంగా ద్విచక్ర వాహనదారుల ప్రాణ భద్రతను కాపాడడమే లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. హెల్మెట్ లేకుండా వాహనం నడిపే వారిని ఇకపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, నిబంధనలను ఉల్లంఘిస్తే ఫైన్ విధించడమే కాకుండా అవసరమైతే డ్రైవింగ్ లైసెన్స్ రద్దుకు కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ “No Helmet – No Entry” విధానం జిల్లా వ్యాప్తంగా అన్ని పట్టణాలు, మండల కేంద్రాలు, ప్రధాన రహదారుల్లో అమలు చేయనున్నట్లు తెలిపారు. పోలీస్ చెక్ పోస్టులు, ప్రత్యేక వాహన తనిఖీల ద్వారా నిబంధనల అమలును పర్యవేక్షిస్తామని చెప్పారు.
అలాగే రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, హెల్మెట్ ధరించడం చట్టపరమైన నిబంధన మాత్రమే కాకుండా జీవిత రక్షణకు కీలకమని జిల్లా ఎస్పీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు, వాహనదారులు తమ సహ ప్రయాణికులకు హెల్మెట్ తప్పనిసరిగా ధరించేలా అవగాహన కల్పించాలని సూచించారు.
Arrive Alive కార్యక్రమం ద్వారా ప్రజల్లో మార్పు తీసుకువచ్చి, రోడ్డు ప్రమాదాల వల్ల జరిగే ప్రాణ నష్టాన్ని గణనీయంగా తగ్గించడమే పోలీస్ శాఖ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *