బీద మధ్యతరగతి ప్రజలకు భరోసా సీఎం సహాయ నిధి-జగిత్యాల ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్.

తేది:16-01-2026 జగిత్యాల జిల్లా TSLAWNEWS ఇంచార్జ్ ఆకుల సంజయ్ రెడ్డి.

జగిత్యాల జిల్లా: జగిత్యాల పట్టణ మోతే రోడ్డు పార్టీ కార్యాలయం లో పట్టణానికి చెందిన 41 మంది లబ్ధిదారులకు సిఎం సహాయ నిధి ద్వారా మంజూరైన 16 లక్షల 8వేల రూపాయల విలువగల చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ గారు,

జగిత్యాల రూరల్ మండల అంతర్గం గ్రామానికి చెందిన మహంకాళి అశ్విని మెదడు సంబంధిత వ్యాధి తోబాధపడుతూ శస్త్ర చికిత్స చేసుకొనే ఆర్థిక స్తోమత లేక ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ గారిని కలవగ స్పందించిన ఎమ్మెల్యే సీఎం సహాయ నిధి ద్వారా శస్త్ర చికిత్స నిమిత్తం3 లక్షల ఎల్ ఓ సి నీ అశ్వినీ కి అందజేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ గారు.
ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం,అడువల జ్యోతి లక్ష్మణ్ మాజీ వైస్ చైర్మన్ గోలి,శ్రీనివాస్,ఎల్లారెడ్డి,బాలే శంకర్,తాజా మాజీ కౌన్సిలర్ లు,పట్టణనాయకులు,యూత్ నాయకులు,మహిళలు,
తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *