బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ హీరోగా నటించిన ‘యానిమల్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాస్తోంది. రెండు రోజుల్లో ఏకంగా రూ.236 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమాపై సంచలన దర్శకుడు ఆర్జీవీ నాలుగు పేజీల రివ్యూ ఇచ్చాడు. ఈ సినిమాని ఒక ప్రేక్షకుడిగా వెళ్లి చూశానని, డైరెక్టర్ సందీప్ వంగ ఇతర దర్శకుల వీపు పగిలిపోయేలా హిట్టు కొట్టి నిరూపించాడని ఆయన అన్నారు. ఈ సినిమాపై భవిష్యత్‌లో కూడా వాదనలు వినిపిస్తాయని చెప్పుకొచ్చారు.