సేవా రత్న – సంక్రాంతి పురస్కారం 2026 డా. పారువెల్లి అంక విజయ దుర్గ భవానీ గారికి ఘన సత్కారం.

తేది:15- 01-2026 హైదరాబాద్ TSLAWNEWS ఇంచార్జ్ విజయ్ మురళీకృష్ణ.

హైదరాబాద్, నాంపల్లి: విశాఖపట్నం కేంద్రంగాకార్యకలాపాలు నిర్వహిస్తున్న మదర్ తెరెసా సోషల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన “సేవా రత్న – సంక్రాంతి పురస్కారం 2026” ను
డా. పారువెల్లి అంక విజయ దుర్గభవానికి ప్రదానం చేశారు.
హైదరాబాద్ నగరంలో పత్రిక ప్రతినిధి గాసేవలందిస్తూ,మానవ హక్కులు & వినియోగదారుల హక్కులు – మహిళా విభాగం లో చురుకైన పాత్ర పోషిస్తూ,లైఫ్ మరియు ఆరోగ్య మరియు జెనరల్ ఇన్సూరెన్స్ సీనియర్ ఫైనాన్షియల్అనలిస్ట్, మోటివేషనల్ స్పీకర్, సైబర్ వారియర్ గా మాత్రమే కాకుండా యాంటీ నార్కోటిక్ సోల్జర్ గా యువతను మత్తు పదార్థాల దుష్ప్రభావాల నుంచి రక్షించేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజ సేవలో ఆమె చేస్తున్న విశేష కృషిని గుర్తించి ఈ పురస్కారంతో సత్కరించారు.
మత్తు పదార్థాల నివారణ, మహిళా సాధికారత, సామాజిక చైతన్యం, మానవ హక్కుల పరిరక్షణ వంటి రంగాల్లో ఆమె అందిస్తున్న అంకితభావ సేవలు అనేక మందికి ఆదర్శంగా నిలుస్తున్నాయని నిర్వాహకులు తెలిపారు.
ఈ అవార్డు ప్రదాన కార్యక్రమం శ్రీ సూరవరం ప్రతాప్ రెడ్డి ఆడిటోరియం, నాంపల్లి, హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించబడింది.ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, సామాజిక కార్యకర్తలు పాల్గొని ఆమె ని అభినందిస్తూ, ఆమె సేవలు మరింత విస్తరించాలని ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *