తేది:15-01-2026 వికారాబాద్ జిల్లా TSLAWNEWS వికారాబాద్ నియోజకవర్గము రిపోర్టర్ లక్ష్మీనారాయణ గొల్ల.
వికారాబాద్ జిల్లా: మోమిన్ పెట్ మండలం అమ్రాధికలాన్ గ్రామంలో యువకులు వినూత్నంగా ఆలోచించారు. సంక్రాంతి పండుగ వస్తే ప్రతివారు వారి ఇంటి దగ్గర వివిధ పనులలో నిమగ్నమై సోషల్ మీడియా లో ఎక్కువగా ఉండడం ద్వారా ఇతరులతో కలవలేక పోతున్నారని వారందరి ఏకతాటిపై తీసుకురావడం కోసం కొంతమంది యువకులు కలిసి ఆ గ్రామంలోని యువకులు నాలుగు టీములుగా ఏర్పడి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. గ్రామంలో ఉన్నటువంటి అన్ని వర్గాల యువకులు ఈ క్రికెట్ క్రీడా పోటీలలో పాల్గొనడం జరిగింది. వారియర్స్ టీం ప్రథమ బహుమతి , సన్ రైజర్స్ టీం ద్వితీయ బహుమతిని గెలుపొందాయి. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గడిజ శంకరప్ప గారు, ఉప సర్పంచ్ షౌకత్ అలీ ఖాన్ గ్రామ వార్డు మెంబర్స్ గ్రామ యువకులు అధిక సంఖ్యలో పాల్గొని క్రీడా పోటీలను వీక్షిస్తూ సంక్రాంతి పండుగను ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శంకరప్ప గారు మాట్లాడుతూ క్రీడలు యువతని శారీరకంగా, మానసికంగా దృఢంగా తయారయ్యేలా చేస్తాయని యువకులు చదువుతోపాటు క్రీడలలో కూడా పాల్గొనాలని తెలియజేయడం జరిగింది. క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించిన మేనేజ్మెంట్ మెంబర్స్ శ్రీనివాస్, లక్ష్మీనారాయణ తదితరులు గ్రామం ఐకమత్యంగా ఉండి గ్రామం అభివృద్ధి జరగాలని , అందరు యువకులు సోదరా భావం ,క్రీడా స్ఫూర్తిని పెంపొందించడానికి ఈ ఫ్రెండ్లీ క్రికెట్ టోర్నమెంట్ ని నిర్వహించడం జరిగిందని తెలియజేశారు.