తేది:15-01-2026 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS అమీన్‌పూర్ మండలం రిపోర్టర్ రాము రావు చాతరాజు.
సంగారెడ్డి జిల్లా, ఆమీనపూర్ మండల పరిధిలో సంక్రాంతి, బోగి, కనుమ పండుగల సందర్భంగా పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగలు రైతుల జీవితాల్లో ఆనందం, ఆశలు నింపే ముఖ్యమైన వేడుకలని వారు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, బోగి పండుగ పాత అలవాట్లను వదిలి కొత్త జీవన విధానానికి నాంది పలికే రోజు అని తెలిపారు. సంక్రాంతి పండుగ కుటుంబ సభ్యులను, బంధువులను ఒక చోట చేర్చి ఆత్మీయతను పెంపొందిస్తుందని, సంప్రదాయాలను కాపాడే పండుగగా నిలుస్తుందని పేర్కొన్నారు.
అలాగే, కనుమ పండుగ గ్రామీణ సంస్కృతిని ప్రతిబింబించే పండుగగా, పశుసంపదకు గౌరవం తెలిపే రోజు అని వివరించారు. ప్రజలందరూ ఈ పండుగలను ఐక్యతతో, ఆనందంగా జరుపుకోవాలని, కొత్త సంవత్సరం అందరికీ ఆరోగ్యం, శాంతి, అభివృద్ధిని తీసుకురావాలని ఆకాంక్షించారు.
సంక్రాంతి, బోగి, కనుమ పండుగలు ఆమీనపూర్ ప్రజల జీవితాల్లో సంతోషాన్ని నింపాలని, ప్రతి ఇంట్లో శుభం, శ్రేయస్సు కలగాలని నాయకులు ఈ సందర్భంగా ఆకాంక్షించారు.