
తేది:15-01-2026 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS సదాశివపేట పట్టణ క్రైమ్ రిపోర్టర్ ఆర్ నవాజ్ రెడ్డి.
సంగారెడ్డి జిల్లా, సదాశివపేట పట్టణం: ఏఐఎంఐఎం జాతీయ అధ్యక్షులు, పార్లమెంట్ సభ్యులు శ్రీ అసదుద్దీన్ ఓవైసీ ఆదేశాల అనుసారం సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ కార్వాన్ శాసనసభ్యులు శ్రీ కౌసర్ మోహి మొద్దీన్ పర్యవేక్షణలో సదాశివపేట పట్టణంలో ఏఐఎంఐఎం పార్టీ కార్యకర్తల సమన్వయ సమావేశమును పట్టణ పార్టీ అధ్యక్షులు శ్రీ గౌస్ పాషా అధ్యక్షతన రాబోవు మున్సిపల్ ఎలక్షన్లను దృష్టిలో ఉంచుకొని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంలో శ్రీ గౌస్ పాషా మాట్లాడుతూ పట్టణ మున్సిపల్ ఎన్నికల్లో ఏఐఎంఐఎం పార్టీ పూర్తి బలముతో ఎక్కువ స్థానాల్లో వార్డుల్లో తమ అభ్యర్థులను నిలబెడుతుందని తెలిపారు. అదేవిధంగా సదాశివపేటలో అన్ని వర్గాల వారి మద్దతుతో ఈసారి బరిలో ఉంటామని తెలిపారు మరియు సదాశివపేట పట్టణంలో 30% జనాభా గల మైనార్టీలకు ఒకసారి కూడా చైర్మన్ గాని వైస్ చైర్మన్ గాని ఏ పార్టీ కూడా తమకు అవకాశం ఇవ్వలేదని ప్రతిసారి మైనార్టీల ఓట్లు వేయించుకోవడమే తప్ప పదవులు కట్ట పెట్టడంలో ఇవ్వడంలో ఎప్పుడూ అవకాశం ఇవ్వలేదని తెలియజేస్తూ నిర్వహించిన కార్యకర్తలసమావేశంలో ఈసారి ఏఐఎంఐఎం పార్టీ కార్యకర్తలు అందరూ గట్టిగా పార్టీ కోసం పనిచేసి ఎన్నికల్లో నిలబెట్టిన అభ్యర్థులను గెలిపించుకోవాలని తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా జాయింట్ సెక్రటరీగా ఎన్నుకోబడిన మన్నన్ ఖాన్ గారు, జిల్లా సభ్యులు రహీం భాయ్, మీర్ మోయిస్ పటేల్, పార్టీ మాజీ అధ్యక్షులు రియాజ్, జున్ను, వసీం, కుద్దూస్, హర్షద్, షఫీ, తదితరులు పాల్గొన్నారు.