విశాఖ వేదికగా మిలాన్–2024 నిర్వహించే విషయంపై రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించినట్టు తూర్పు నావికా దళాధిపతి, వైస్ అడ్మిరల్ పెంథార్కర్ వెల్లడించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 19 నుంచి 27 వరకూ మిలాన్ విన్యాసాలు నిర్వహిస్తామన్నారు. 50 దేశాలతో రికార్డు స్థాయిలో మిలాన్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. తుపాను కారణంగా నేవీ డేను ఈ నెల 10వ తేదీకి వాయిదా వేశామన్నారు. ఈ విన్యాసాల్లో తొలిసారిగా స్వావలంబన్ పేరుతో టెక్నికల్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నామని చెప్పారు.