తేది:14-01-2026 ఖమ్మం జిల్లా.TSLAWNEWS వేంసూర్ మండలం రిపోర్టర్ మహమ్మద్ బురహానుద్దీన్.
ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలోని వేంసూరు సత్తుపల్లి పెనుబల్లి మండలాల్లోని ఆరుగురు సైబర్ నేరగాళ్లు,రూ. 547 కోట్లు సైబర్ క్రైమ్ ద్వారా హవాలా రూపంలో ఆరుగురు ఖాతాల్లో తరలినట్లు ఈ కేసులో 18 మందిని అరెస్టు చేసినట్లు మరో ఆరు గురి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు ఖమ్మం జిల్లా సిపి సునీల్ దత్ తెలిపారు.
పెనుబల్లి మండలం వియం బంజర్ పోలీస్ స్టేషన్లో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో జిల్లా సీపీ సునీల్ దట్ విలేకరులతో మాట్లాడారు. ఈ క్రమంలో గత ఏడాది 20 25 నవంబర్ 24వ తేదీన సత్తుపల్లి మండలం తుంబూరు గ్రామానికి చెందిన మోదుగు సాయికిరణ్ కి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి పలు బ్యాంకుల్లో అకౌంట్. లు ఓపెన్ చేసి తన బ్యాంకు పాస్, బుక్ ఏటీఎం కార్డు ద్వారా పలువురు సైబర్ క్రైమ్ లకు పాల్పడినట్లు పెనుబల్లి మండలం విఎం మంజూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా,ఫిర్యాదులు సేకరించిన సత్తుపల్లి రూరల్ సిఐ. ఎన్.వి ముత్తులింగం, కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ ఐపిఎస్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో సత్తుపల్లి మండలానికి చెందిన ఆరుగురు, వంసర్ మండలానికి చెందిన 11 మందిని ఏజెంట్లుగా ఏర్పాటు చేసుకొని వారి ఖాతాల్లోకి నగదు బదిలీ అయినట్లు పోలీసు అధికారులు గుర్తించారు. వీరి బ్యాంక్ అకౌంట్లోకి సుమారు 10 దేశాల్లో ఆఫీసులోనూ ఏర్పాటు చేసి వందలాదిమందిదేశ పౌరులకు పెట్టుబడి మాట్రిమోనీ రివార్డు పాయింట్స్ గెమింగ్స్ బెట్టింగ్. షేర్ మార్కెటింగ్ పెట్టుబడులు కెప్టొ కరెన్సీ ట్రేడింగ్ పేరుతో మోసగించి ఎవరైనా బాధ్యతలు వారి మాయమాటలకు ఆకర్షించబడే అతనికి వారి టెలిగ్రామ్ గ్రూపులో సభ్యునిగా చేర్చి తర్వాత వారికి మోసపూరిత లింకులు పంపి వారి అకౌంట్లో నుంచి డబ్బులు ఖాళీ చేయడం జరిగిందన్నారు. సైబర్ క్రైమ్ ద్వారా వచ్చిన అమౌంట్ ను ముందుగా ఏజెంట్లు ఖాతాలోకి బదలాయించి తర్వాత ఇట్టి సొమ్మును కరెంటు అకౌంట్లోకి మార్చి చివరిగా తమ పర్సనల్ ఖాతాలోకి యూఎస్ డాలర్లోకి క్రిప్టో కరెన్సీ రూపంలో మార్చి తమ సొంత ఖా తా ల్లోకి మళ్లించినట్లు తెలిపారు. ఈ కేసులో ఇప్పటివరకు సత్తుపల్లి మండలాన్ని చెందిన కోట్లు మనోజ్ కళ్యాణ్, ఖాతాలో 114 ఫైట్ 18 కోట్లు, ఉ డతానేని.వికాస్ చౌదరి, ఖాతాల్లో 80.41 కోట్లు మేడ భానుప్రియ ఖాతాలోకి 45.62 కోట్లు మేడ సతీష్ 135.48 కోట్లు, బొమ్మిడాల నాగలక్ష్మి 81.72 కోట్లు, కరీంనగర్ కు చెందిన నరసింహ కిరణ అండ్ డైరీ, తాటికొండ రాజు ఖాతాలోకి 92.54 కోట్లు. ఏడుగురి ఖాతాలలో ఐదు నలభై ఏడు కోట్లు రూపాయలు హవాలా నగదు బదలాయింపు జరిగినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. ఈ కేసుతో సంబంధం ఉన్న 17 మంది నిందితులను అరెస్టు చేశామని మరో ఆరుగురు నిందితులకు పరారీలో ఉన్నట్లు వారిని త్వరలోనే పట్టుకుంటామని ఈ కేసు అది దేశాలలో ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని, ఇన్వెస్టిగేషన్లో భాగంగా మరికొంతమంది అరెస్ట్ అవుతారని అన్నారు. ఈ సైబర్ క్రైమ్ మరింత లోతుగా పరిశీలించి దర్యాప్తు పూర్తి చేస్తామని ఖమ్మం జిల్లా సిపి సునీల్ దత్ తెలిపారు. కల్లూరు ఏసిపి వసుంధర యాదవ్, ఐపీఎస్ సత్తుపల్లి రూరల్ సీఐ ముత్తిలింగం పోలీస్ సిబ్బందిని అభినందించారు.