తేది:14-01-2026 మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా TSLAWNEWS స్టాఫ్ రిపోర్టర్ పారువెల్లి దుర్గాభవాని.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : (తెలంగాణ): మేడ్చల్ జిల్లా కీసర పరిధిలో చైనా మాంజా మరో ప్రమాదానికి కారణమైంది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ వ్యక్తి మెడకు గాలిపటం మాంజా చుట్టుకోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. మెడపై లోతైన కట్ ఏర్పడటంతో స్థానికులు వెంటనే స్పందించి బాధితుడిని సమీప ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స అందించిన వైద్యులు మెడకు 19 కుట్లు వేశారు.
సంక్రాంతి పండుగ నేపథ్యంలో నిషేధితమైన చైనా మాంజాను దొంగచాటుగా విక్రయిస్తున్న ఘటనలు పెరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదం ప్రజల భద్రతపై తీవ్రమైన ముప్పుగా మారిందని పేర్కొన్నారు.
ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ఉండాలంటే సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని, అలాగే ప్రజలు కూడా బాధ్యతగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. చైనా మాంజాను విక్రయిస్తున్న వారిపై సమాచారం తెలిసిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు తెలియజేయాలని కోరారు.