ప్రజాపక్షం పాత్ర ప్రజల పక్షం-తహసిల్దార్ మల్లయ్య

తేది:13- 01- 2026 మెదక్ జిల్లా TSLAWNEWS అల్లాదుర్గం మండల రిపోర్టర్ వి పాపయ్య చారి.

మెదక్ జిల్లా: నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిష్పక్షపాతంగా వార్తలతో దూసుకుపోతున్న ప్రజాపక్షం దినపత్రిక అని తహసిల్దార్ మల్లయ్య కొనియాడారు. మంగళవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ప్రజా పక్షం దినపత్రిక 2006 నూతన సంవత్సరం క్యాలెండర్ మండల విలేఖరి పాపయ్య చారి తో కలిసి ఆయన ఆవిష్కరించారు. అనంతరం తాసిల్దార్ మల్లయ్య మాట్లాడుతూ ప్రజా సమస్యలను ప్రభుత్వానికి తెలియపరుస్తూ ప్రభుత్వానికి ప్రభుత్వ అధికారులకు ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తుందని నిజాలను వెలికితీయడంలో ప్రజల పక్షాన నిలబడడంలో ప్రజా పక్షం దినపత్రిక జాతీయస్థాయిలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుందని ఆయన ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది కంప్యూటర్ ఆపరేటర్ మల్లేశం, కృష్ణ, రాజు, రాజా గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *