కోనాపూర్ పార్కింగ్ టెండర్ల రద్దు – అధికారుల అనుమతులు లేకుండానే టెండర్లు జరిగిందనే వార్త వాస్తవమే ఎంపిడిఓ సలీం – జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ కు కృతజ్ఞతలు తెలిపిన ప్రజలు.

తేది:13- 01- 2026 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి.

జగిత్యాల జిల్లా: దుబ్బరాజన్న ఆలయం దగ్గర కోనాపూర్ సైకిల్ పార్కింగ్ టెండర్ల రద్దు చేసినట్టు ఎంపిడిఓ సలీం తెలిపారు. కోనాపూర్ సైకిల్ పార్కింగ్ టెండర్లలో అధికారుల అనుమతులు లేకుండానే చట్టాలకు విరుద్ధంగా జరిగిందనే వార్త వాస్తవమే ఎంపిడిఓ సలీం తెలిపారు.
జగిత్యాల జిల్లాలో ప్రసిద్ది చెందిన దుబ్బరాజన్న మహాశివరాత్రి జాతర వచ్చే నెల ఫిబ్రవరిలో జరుగుతున్నందు వల్ల భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా, వచ్చే భక్తుల వాహనాలు పార్కింగ్ చేయడానికి టెండర్లు వేస్తారు. కానీ
కోనాపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి ప్రభుత్వ అధికారుల అనుమతులు లేకుండానే చట్టాలకు విరుద్ధంగా తేది: 12- 01- 2026 సోమవారం నాడు వాహనాలు పార్కింగ్ టెండర్ నిర్వహించినట్లు తెలిపారు. కోనాపూర్ సైకిల్ పార్కింగ్ టెండర్లలో గోల్ మాల్ జరిగిందని, ప్రభుత్వ అధికారుల అనుమతులు లేకుండానే చట్టాలకు విరుద్ధంగా టెండర్లు జరిగాయని ప్రజలు ఆరోపించారు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే టెండర్లు రద్దు చేశారని తెలిపారు. అధికారులకు, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ కు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *