మాల్దీవుల నుంచి సైన్యాన్ని వెనక్కి తీసుకెళ్లేందుకు భారత ప్రభుత్వం అంగీకరించిందని మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు తెలిపారు. ఈ మేరకు ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడారు. పలు అభివృద్ధి ప్రాజెక్టుల సమస్యల పరిష్కారం కోసం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసేందుకు భారత్ ఒప్పుకుందన్నారు.