తేది:13-01-2026 వికారాబాద్ జిల్లా TSLAWNEWS వికారాబాద్ నియోజకవర్గము రిపోర్టర్ లక్ష్మీనారాయణ గొల్ల.
వికారాబాద్ జిల్లా: వికారాబాద్ మునిసిపల్ ఎన్నికలలో ప్రధాన పార్టీలు బలమైన అభ్యర్థులను ఎంపిక చేసి బరిలో దించాలని ప్రయత్నిస్తున్నాయి. తెరాస, కాంగ్రెస్, బిజెపి బలమైన అభ్యర్థి నీ నిలిపి వికారాబాద్ మునిసిపల్ ఎన్నికలలో పాగా వేయాలని ప్రయత్నిస్తున్నాయి. కానీ కొంతమంది సీనియర్ నాయకులు తమకు మాత్రమే టికెట్లు కావాలని కోరడంతో బుజ్జగింపులు మొదలయ్యాయి.వారు స్వతంత్ర అభ్యర్థిగా నిలిస్తే ఓట్ల చీలిక జరుగుతుందని ప్రధాన పార్టీల పెద్దలు సైతం భయపడుతున్నారు.