తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించింది. ఆ పార్టీ నుంచి తదుపరి సీఎంగా ఎవరు ఉండనున్నారనే విషయం నేడు తేలనుంది. కాంగ్రెస్ శాసనసభాపక్ష (సీఎల్పీ) సమావేశం ఇవాళ జరగనుంది. హైదరాబాద్లోని ఎల్లా హోటల్ వేదికగా ఉదయం 9:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశంలో సీఎం అభ్యర్థిని ఎన్నుకోనున్నారు. కాగా, గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థులంతా ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు.