బీసీ కాలని నీటి సమస్యల పరిష్కారం: పాల్వంచలో కొత్త మోటర్ ప్రారంభించిన సర్పంచ్ రుక్మిణి బాలరెడ్డి.

తేది:12-1-2026 TSLAWNEWS మెదక్ జిల్లా టేక్మల్ మండల రిపోర్టర్ రొడ్డ సాయిలు.

మెదక్ జిల్లా: ఈ రోజు టేక్మాల్ మండలం పాల్వంచ గ్రామంలోని బీసీ కాలనిలో తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలనే ఉద్దేశంతో గ్రామ సర్పంచ్ శ్రీమతి రుక్మిణి బాలరెడ్డి గారి ఆధ్వర్యంలో కొత్త మోటర్‌ను ఏర్పాటు చేశారు. గత కొంతకాలంగా కాలనీలో ఎదురవుతున్న నీటి సమస్యను దృష్టిలో ఉంచుకొని, గ్రామపంచాయతీ నిధులతో ఈ మోటర్‌ను దింపడం జరిగింది.
ఈ సందర్భంగా సర్పంచ్ రుక్మిణి బాలరెడ్డి గారు మాట్లాడుతూ, గ్రామంలోని ప్రతి కాలనికి నిరంతర తాగునీరు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ముఖ్యంగా వేసవికాలంలో నీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని, అవసరమైతే మరిన్ని ఏర్పాట్లు కూడా చేస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్లు, గ్రామ నాయకులు పాల్గొని సర్పంచ్ గారి కృషిని అభినందించారు. గ్రామస్తులు కూడా కొత్త మోటర్ ఏర్పాటు వల్ల నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ చర్య గ్రామ అభివృద్ధి దిశగా మరో ముందడుగుగా నిలిచిందని స్థానికులు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *