శ్రీ గోదా రంగనాథ స్వామి వారి కళ్యాణోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే రోహిత్ రావు. క్యాంప్ ఆఫీసులో కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం.

తేది:12-1-2026 TSLAWNEWS మెదక్ జిల్లా మెదక్ మండల రిపోర్టర్ శివలింగం ఎల్లం.

మెదక్ జిల్లా: మెదక్ పట్టణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ గోదా రంగనాథ స్వామి వారి కళ్యాణోత్సవంలో మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు పాల్గొన్నారు. దేవాలయంలో స్వామివారికి పూజలు నిర్వహించారు. ఆలయ ఉత్సవ కమిటీ ఎమ్మెల్యే గారికి స్వామివారి ప్రతిమను అందజేశారు, స్వామి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని స్వామి వారికి మొక్కుకున్నట్లు ఎమ్మెల్యే రోహిత్ రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు పాల్గొన్నారు. తర్వాత అక్కడి నుండి క్యాంప్ ఆఫీస్ లో కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు,మెదక్ మండల్ కాజిపల్లి,గ్రామానికి చెందినటువంటి, మంగలి ఎల్లమ్మ, గొల్ల అంజమ్మ, వనం నిర్మల గార్లకు, నూతనంగా ఎన్నుకోబడిన గ్రామ సర్పంచ్ కొంగరి నర్సింలు, గారి చేతుల మీదుగా కళ్యాణ లక్ష్మి, చెక్కులు అందజేయడం జరిగింది, పులిగిల్ల రాజశేఖర్ రావు, వడ్ల మోహనా చారి, పాల్గొన్నారు, ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొని ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *