తేది:12- 01- 2026 మెదక్ జిల్లా TSLAWNEWS అల్లాదుర్గం మండలం రిపోర్టర్ వి పాపయ్య చారి.
మెదక్ జిల్లా:అల్లాదుర్గం మండల కేంద్రంలోని సీతానగర్ గ్రామంలో రైతు బాదేన తుకారం పొలంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఆయిల్ ఫామ్ చెట్లను నాటిన వాట్పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీమతి కొప్పుల లక్ష్మి శేషారెడ్డి చెట్లను నాటి మొక్కలను పర్యవేక్షించారు.
వీరు మాట్లాడుతూ మండలంలో వరి సాగు చేసే రైతులు ఆయిల్ పామ్ వేసుకోవడానికి ముందుకు రావాలని తెలియజేసారు.
ఆయిల్ పామ్ ను వరిలో కూడా అంతర పంటగా సాగు చేయవచ్చని తుకారాం అనే రైతు ఆయిల్ పామ్ ను అంతర పంటగా వారిలో సాగు చేయడానికి ముందుకు రావడం వలన అతని పొలంలో ఆయిల్ పామ్ మొక్కను నాటడం జరిగింది. ఆసక్తి గల రైతులు వారిలో ఆయిల్ పామ్ నాటడానికి ముందుకు రావాలని తెలియజేశారు.
ప్రభుత్వం మొక్కలకు మరియు డ్రిప్పుకు 90% రాయితీలు ఇస్తుందని వరి కంటే ఆయిల్ పామ్ సాగు ద్వారా మంచి ఆదాయం పొందవచ్చని, ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఉద్యాన శాఖ ద్వారా ఆయిల్ పామ్ సాగు చేపట్టు రైతులకు మొక్కలపై 11,001/- రాయితితో పాటు నాలుగు సంవత్సరములు తోట నిర్వహణ మరియు అంతర పంటల సాగు కొరకు ఎకరాకు సంవత్సరానికి రూ.4,200/- చొప్పున మొత్తంగా రూ.16,800/- రాయితీ సొమ్మును రైతుల ఖాతాలో జమ చేయబడును.
ఒక రైతుకు గరిష్టంగా 12.50 ఎకరాల వరకు డ్రిప్ పరికరాల పై రాయితీ సదుపాయం కల్పించబడును .
ఆయిల్ పామ్ మొక్కలు నాటిన నాలుగు సంవత్సరముల తరువాత ఎకరానికి 10-12 టన్నుల దిగుబడి వచ్చును.
ప్రస్తుతం ఒక్క టన్ను ఆయిల్ పామ్ గెల ధర రూ. 20,500/-. ఈ లెక్కన సంవత్సరమునకు రూ. 2,05,000/- ఆదాయం వచ్చును. ఖర్చులు పోను ఒక ఎకరానికి సంవత్సరమునకు రూ. 1,50,000/- పొందవచ్చు.
కావున మండలం లోని రైతులు ఆయిల్ పామ్ సాగు పై అవగాహన పెంచుకొని అధిక విస్తీర్ణంలో ఆయిల్ పామ్ సాగు చేపట్టి ఇతర పంటల కంటే అధిక దిగుబడి మరియు లాభం పొందవలసిందిగా తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి నవీన్, లీవ్ పామ్ కంపెనీ అసిస్టెంట్ మేనేజర్ జాన్సన్, సోషల్ మీడియా కోఆర్డినేటర్ జైపాల్ ,సర్పంచ్ శోభ సంతోష్, రమేష్ ,వెంకటేష్ ,కవిత
ఫీల్డ్ ఆఫీసర్ నజీర్, మరియు రైతులు పాల్గొన్నారు.