తేది:12- 01- 2026 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి
జగిత్యాల జిల్లా: బుగ్గారం మండల సర్పంచ్ ల ఫోరం ఎన్నికలు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేముల సుభాష్ సమక్షంలో సోమవారం ఏకగ్రీవంగా జరిగాయని ఒక ప్రకటనలో తెలిపారు.
మండలంలోని సర్పంచులు సమావేశమై, మండల ఫోరం అధ్యక్షులుగా సర్పంచ్ బీర్ పూర్ తిరుపతి ( గోపులాపూర్), ప్రధాన కార్యదర్శిగా పంచిత ధర్మరాజు ( సిరికొండ), ఉపాధ్యక్షులుగా గట్టు శారద గంగారాం( చిన్నాపుర్,) కార్యదర్శిగా నీలం నందిని సంతోష్ ( వెల్గొండ ), కోశాధికారిగా గాదే మహేష్ (చందయ్యాపల్లె )లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
నూతనంగా ఎన్నికైన మండల సర్పంచుల ఫోరం కార్యవర్గాన్ని పలువురు అభినందించారు.