కోయగుట్ట మల్లన్న కు బోనాలు-మల్లన్న స్వామికి ప్రత్యేక పూజలు.

తేది:11-1-2026 TSLAWNEWS మెదక్ జిల్లా మెదక్ మండలం రిపోర్టర్ శివలింగం ఎల్లం.

మెదక్ జిల్లా: మెదక్ జిల్లాలోని మెదక్ మండలంలో శివారులోని కొయ్యగుట్ట మల్లన్న ఆలయంలో భక్తుల జన సందోహం భారీగా తరలివచ్చింది. స్వామివారికి సెట్టెడు వారల సందర్భంగా భక్తులు మొక్కులు తీర్చుకున్నారు శ్రీ మల్లికార్జున స్వామి వ్యవస్థాపక పూజారి మల్లన్న స్వామి ఆధ్వర్యంలో ప్రతివారం శ్రీ మల్లికార్జున స్వామి కి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. ఆదివారం రోజున భక్తులతో కిటకిటలాడింది. పూజారి మల్లన్న ఆధ్వర్యంలో స్వామివారిని ప్రత్యేక అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అయ్యప్ప సంఖ్యల హాజరై అదే కోయగుట్ట పై ఉన్న రేణుక ఎల్లమ్మ, భూదేవి మాత ఆలయంలో అమ్మవారికి ఓడి బియ్యం సమర్పించారు. గంగిరేగు చెట్టు వద్ద బోనాలు వేసి మల్లన్నకు మొక్కులు అప్పగించారు ఆలయ ప్రాంగణంలో మల్లన్న నామస్మరణతో మార్మోగింది. అనంతరం భక్తులకు అన్నదాన వితరణ చేశారు ఈ కార్యక్రమంలో మల్లికార్జున్, చారి, భక్తులు తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *