నిజామాబాద్ పట్టణంలో సి ఎమ్ సహాయ నిధి చెక్కుల పంపిణి కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ ప్రదేశ్ అధ్యక్షుడు బి మహేష్ కుమార్ గౌడ్.

తేది:11-1-2026 నిజామాబాద్ జిల్లా TSLAWNEWS ఇంచార్జి గోర్కంటి లింగన్న.

నిజామాబాద్ జిల్లా: నిజామాబాద్ పట్టణంలో సీఎం సహాయ నిధి (CMRF) చెక్కులను అర్హులైన లబ్ధిదారులకు టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు స్వయంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ మరియూ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాటిపల్లి నాగేష్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తోందని తెలిపారు. అనారోగ్యంతో బాధపడుతున్న పేద కుటుంబాలకు సీఎం సహాయ నిధి ఎంతో అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. అవసరంలో ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సహాయం అందేలా కృషి చేస్తున్నామని అన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజల సమస్యలను ప్రాధాన్యతగా తీసుకుని పరిష్కరిస్తున్నామని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *