నేషనల్ హైవే ఫ్లైఓవర్ బ్రిడ్జిపై పోతున్న ఆర్టీసీ బస్సులు-స్పందించని హైదరాబాద్ 2 డిపో మేనేజర్.

తేది:11- 01- 2026 మెదక్ జిల్లా TSLAWNEWS అల్లాదుర్గం మండల రిపోర్టర్ వి. పాపయ్య చారి.

మెదక్ జిల్లా: అల్లాదుర్గం నేషనల్ హైవే బ్రిడ్జ్ లపై బస్సులు వెళ్తున్నప్పటికీ ప్రయాణికులు ఇబ్బంది పడుతుంటే ఆర్టీసీ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ఏర్పాటు చేసిన తర్వాత మహిళ ప్రయాణికుల ఆదరణ తిరగడంతో ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు, వివిధ పనుల నిమిత్తం అల్లాదుర్గం ఐబి చౌరస్తా నుండి వివిధ మండలాల నుండి నిత్యం వందలాది మంది ప్రయాణికులు వెళ్తుంటారు. ఎప్పుడూ రద్దీగా ఉండే ఈ చౌరస్తాలో హైదరాబాద్ 2 డిపో కు చెందిన ఆర్టీసీ బస్సులు అల్లాదుర్గం సర్వీస్ రోడ్డు నుండి వెళ్లకుండా ఫ్లైఓవర్ బ్రిడ్జి పైనుండి బస్సులు వెళ్తున్నాయని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సులు నడుపుతుండడంతో ఈ పథకాన్ని మహిళలు ఉపయోగించుకుంటున్నారు. ఐబి చౌరస్తా నుండి వట్టిపల్లి, రేగొడ్, తో పాటు అల్లాదుర్గం మండలం నుండి ఆయా గ్రామాల ప్రజలు ఈ చౌరస్తా నుండి ప్రయాణిస్తుంటారు. నిత్యం రద్దీగా ఉండే ఐబి చౌరస్తాలో బస్సులు ఫ్లైఓవర్ నుండి వెళ్తుండడంతో ప్రయాణికులు గంటల తరబడి బస్సుల కోసం ఎదురు చూడవలసి వస్తుందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ 1 హైదరాబాద్, డిపో2 మేజర్ కు వివరణ కోరెందుకు ప్రయత్నించగా స్పందించకపోవడం విడ్డూరం ఆర్టీసీ ఎండి స్పందించి ఫ్లైఓవర్ నుండి వెళ్లకుండా ఐబి చౌరస్తా సర్వీస్ రోడ్ల నుండి వెళ్లేలా చూడాలని ఆయా మండలాల ప్రయాణికులు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *