తేది :11-01-2026 TSLAWNEWS సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండల క్రైమ్ రిపోర్టర్ బి ప్రసాద్ గౌడ్ .
కాంగ్రెస్ పార్టీ సంక్షేమ ఫలాలను దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ పార్టీలో చేరికైనా ప్రజలకు సేవ చేసేందుకు ముందుండి నడిపిస్తున్న – కాంగ్రెస్ పార్టీ నాయకుడు చిరంజీవి( చిరు).
సంగారెడ్డి జిల్లా: సదాశివపేట మండలం పట్టణంలో గల వీరబద్రియ కుల సంఘ కులస్తులు సభ్యులు దాదాపు 100 మంది కాంగ్రెస్ పార్టీ యొక్క పనితీరును చూసి యువ నాయకులు, మహిళలు చేరారు. అదేవిధంగా వివిధ కుల సంఘాల వారు కాంగ్రెస్ పార్టీ పనితీరుకు ఆకర్షనితులై కాంగ్రెస్ పార్టీ నాయకులను సంప్రదిస్తున్నారని పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకుడు చిరంజీవి చిరు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ యొక్క జీవిత లక్ష్యం అని శ్రీమతి శ్రీ తూర్పు జయప్రకాష్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకులకు మహిళలకు మరియు పట్టణవాసులకు భరోసానిచ్చారు. ఈ యొక్క కార్యక్రమంలో సి డి సి చైర్మన్ రామిరెడ్డి, నాయకులు సిద్ధన్న, మాజీ కౌన్సిలర్ విశ్వనాథం, వివిధ సంఘాల నాయకులు మరియు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.