

తేది:11-01-2026 TSLAWNEWS తెలంగాణ ఇన్చార్జ్ గౌండ్ల రమేష్ గౌడ్.
జోగులంబ గద్వాల జిల్లా: మానవపాడు మండలం, దల్లాపురం గ్రామానికి చెందిన ఎస్సి మాదిగ కులానికి చెందిన జూనియర్ డాక్టర్.లావణ్య సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ గా పనిచేస్తున్నది. అదే ఆసుపత్రిలో కంసాలి కులానికి చెందిన ప్రణయ్ తేజ్ అని వ్యక్తితో ప్రేమ వ్యవహారం ఉన్నది. దళితురాలు అని ప్రేమ వివాహానికి ప్రణయ్ తేజ్ లావణ్య తో నిరాకరించడం మూలంగా మనస్థాపానికి గురైన లావణ్య 03.01.2026 న ఆత్మహత్య చేసుకున్నది. నేడు(11.01.2026) దల్లాపురం గ్రామానికి వెళ్లి లావణ్య కుటుంబ సభ్యులైన మనోహర్_బేసమ్మ దంపతులని పరామర్శించి సానుభూతి తెలియజేసి మనో ధైర్యాన్ని కల్పించిన బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ చైర్మన్ డా. విశారదన్ మహారాజ్ గారు.