తేది:11-1-2026 TSLAWNEWS మెదక్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తోట అభిలాష్.
మెదక్ జిల్లా: పాపన్నపేట మండలం కోత్తపల్లి గ్రామ శివారులో అక్రమంగా బొమ్మ–బొడుసు జూదం నిర్వహిస్తున్నారనే నమ్మకమైన సమాచారం మేరకు పోలీసు అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో జూదం ఆడుతున్న 6 మందిని అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రూ.31,433 నగదుతో పాటు 5 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
జూదం వంటి అక్రమ కార్యకలాపాలు సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించడమే కాకుండా, కుటుంబాల ఆర్థిక పరిస్థితిని దెబ్బతీస్తాయని పోలీసులు స్పష్టం చేశారు. ఇలాంటి చట్టవ్యతిరేక చర్యలపై ఎలాంటి సడలింపులు ఉండవని జిల్లా ఎస్పీ శ్రీ డి.వి. శ్రీనివాస రావు ఐపీఎస్ కఠినంగా హెచ్చరించారు.
ప్రజలు అక్రమ జూదం, మత్తుపదార్థాల విక్రయం, ఇతర నేర కార్యకలాపాలపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు. జిల్లా వ్యాప్తంగా చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని పోలీసులు తెలిపారు.