“లెజెండరీ ఉమెన్ ఆఫ్ ఇండియా – 2025–26” అవార్డుకు ఎంపికైన డా. పారువెల్లి అంక దుర్గ భవానీ.

తేది:10-01-2026 TSLAWNEWS హైదరాబాద్ ఇంచార్జ్ విజయ్ మురళీకృష్ణ.

హైదరాబాద్, అబిడ్స్ : జై భీమ్ యూనిటీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో, జి. ఎస్ హెచ్ ఎస్ టి అకాడమీ ఇండియా, డే స్ప్రింగ్ థియాలజికల్ యూనివర్సిటీ (డల్లాస్, టెక్సాస్ –యు ఎస్ ఎ)సహకారంతో నిర్వహించనున్న “లెజెండ్రీ వుమెన్ ఆఫ్ ఇండియా – 2025–26” కార్యక్రమానికి డా. పారువెల్లి అంక దుర్గ భవానీ ఎంపిక కావడం విశేషం.
సమాజ సేవ, మహిళా సాధికారత, ప్రజా హిత కార్యక్రమాల్లో విశేష సేవలందించినందుకు గాను ఆమెకు ఈ ప్రతిష్టాత్మక గౌరవం దక్కింది. మహిళలకు ఆదర్శంగా నిలుస్తూ, సేవా రంగంలో ఆమె చేస్తున్న కృషిని గుర్తించి ఈ అవార్డును ప్రదానం చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ అవార్డు ప్రదాన కార్యక్రమం
హైదరాబాద్ లో నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, సామాజిక నాయకులు, మహిళా సంఘాల ప్రతినిధులు హాజరుకానున్నారు. డా. దుర్గ భవానీకి ఈ గౌరవం లభించడం ఆమె కుటుంబ సభ్యులతో పాటు అభిమానులకు, శ్రేయోభిలాషులకు గర్వకారణంగా నిలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *