తేది :10-01-2026 నల్గొండ జిల్లా TSLAWNEWS దేవరకొండ నియోజకవర్గం పులిజాల గోవర్ధన్.
నల్గొండ జిల్లా: దేవరకొండ నియోజకవర్గం,డిండి మండల కేంద్రంలో నూతనంగా ఎన్నికైన సర్పంచులకు మరియు ఉపసర్పంచ్ లకు గౌరవ డిఎస్పి శ్రీనివాసరావు మరియు ఎస్సై బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసి గ్రామాలలో శాంతి భద్రతలు కాపాడాలని, అభివృద్ధి పనులు చేయాలని, మీ మీ గ్రామంలో ఏమైనా సమస్యలు ఉంటే పోలీసుల దృష్టికి తీసుకువచ్చి సమస్యలు పరిష్కరించుకోవాల్సిందిగా సూచనలు చేయడం జరిగింది. తదనంతరం నిజాంనగర్ సర్పంచ్ వింజమూరి శశికళ శేఖర్ గారిని డి.ఎస్.పి శ్రీనివాసరావు మరియు ఎస్సై బాలకృష్ణ అభినందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచ్ లు మరియు ఉపసర్పంచులు, పోలీస్ సిబ్బంది పాల్గొనడం జరిగింది.