కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. ఇది ఎప్పటికి వదులుతుందో తెలియక అందరిలోనూ భయాందోళనలు పెరిగిపోతున్నాయి. ఒకవేళ కోవిడ్ 19 అదుపులోకి వచ్చినా.. దీని ప్రతికూల ప్రభావాల నుంచి బైటపడేందుకు కనీసం ఆరు నెలల నుంచి ఏడాది పట్టేస్తుందని దేశీయంగా ప్రజలు భావిస్తున్నారు. అంతే కాదు.. అత్యంత భయంకరమైన వ్యాధుల జాబితాలో క్యాన్సర్, ఎయిడ్స్‌ను కూడా దాటేసి కోవిడ్ 19 టాప్ ప్లేస్‌లో ఉంది. మార్కెట్ రీసెర్చ్, అనాలిసిస్ సంస్థ వెలాసిటీ ఎంఆర్ నిర్వహించిన సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. మార్చి 19–20 మధ్య హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై తదితర ప్రధాన నగరాల్లో ఈ ఆన్‌లైన్ సర్వే నిర్వహించారు. ఇందులో 2,100 మంది పాల్గొనారు.