బ్రాహ్మణ్ బస్తీ లో ఘనంగా మెగా ఉచిత వైద్య శిబిరం.

తేది:10-01-2026 TSLAWNEWS హైదరాబాద్ ఇంచార్జ్ విజయ్ మురళీకృష్ణ.

హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని వరసిగూడ, బ్రాహ్మణ్ బస్తీలో బ్రాహ్మణ్ బస్తీ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి శ్రీకర హాస్పిటల్స్ వైద్య బృందం, మెడ్ రైడర్ (24×7 హెల్త్ అసిస్టెన్స్) సహకారం అందించాయి.
ఈ వైద్య శిబిరంలో జనరల్ ఫిజీషియన్,ఆర్థోపెడిక్,
గైనకాలజిస్ట్, పిల్లల వైద్య నిపుణులు ఈసీజీ, రక్త పరీక్షలు,ర్యాండమ్ షుగర్ టెస్ట్, కాస్మెటిక్ డెంటల్ సర్జన్ సేవలు ఉచితంగా అందించడంతో పాటు అవసరమైన మందులను కూడా ఉచితంగా పంపిణీ చేశారు.
వైద్య శిబిరానికి పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు హాజరై సేవలను వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన నిర్వాహకులు మాట్లాడుతూ, “సమాజ ఆరోగ్య పరిరక్షణే మా లక్ష్యం. పేదలు, మధ్యతరగతి ప్రజలకు ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి” అనితెలిపారు.
ఈ కార్యక్రమంలో వైద్యులు, నర్సింగ్ స్టాఫ్, వాలంటీర్లు, స్థానిక నాయకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *