నీటి పంపకాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని ఏపీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ. కృష్ణా జలాల విషయంలో ఏపీ తీవ్రంగా నష్టపోయిందన్నారు. తెలంగాణ ఎక్కువ నీళ్లు వాడుకుంటోందని, జగన్ నాయకత్వంలో మన నీళ్ల కోసం పోరాడే ప్రయత్నం చేస్తున్నాం అని తెలిపారు. 2014లో బాబు ముఖ్యమంత్రి కావడం మన రాష్ట్రానికి పట్టిన దుస్థితి. గతంలో కృష్ణా బోర్డుకు ఇండెంట్ ఇవ్వకుండానే తెలంగాణ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా నీటిని వాడుకుంది.” అని అంబటి రాంబాబు తెలిపారు.