తేది:10-01-2026 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి.
జగిత్యాల జిల్లా :న్యాయవ్యవస్థను ప్రజలకు మరింత సులభంగా, వేగవంతంగా మరియు పారదర్శకంగా అందించాలంటే కోర్టులు మరియు పోలీస్ శాఖల మధ్య సమన్వయం అత్యంత కీలకమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్న పద్మావతి అన్నారు. ఈ దిశగా జిల్లా కోర్టు ప్రాంగణంలో జిల్లా కోర్టు కోఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించబడింది.
ఈ సమావేశంలో జిల్లాలోని వివిధ కోర్టులకు చెందిన న్యాయమూర్తులు, పోలీస్ శాఖకు చెందిన ఉన్నతాధికారులు, కోర్టు అధికారులు పాల్గొన్నారు.
కేసుల పరిష్కారంలో చక్కటి సేవలందించిన న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్, పోలీస్ అధికారులు మరియు సిబ్బందిని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గారు అభినందిస్తూ ప్రశంసా పత్రాలు అందజేశారు.
అందులో భాగంగా జగిత్యాల జిల్లా జడ్జి రత్న పద్మావతి నుండి రూరల్ ఎస్సై ఉమా సాగర్ ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్, అదనపు జిల్లా జడ్జి శ్రీ నారాయణ, సెక్రటరీ లీగల్ సెల్ జగిత్యాల వెంకట మల్లిక్ సుబ్రమణ్య శర్మ, సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వర్ రావు, మేజిస్ట్రేట్ లు, శ్రీనిజ కొహిర్కార్,అరుణ్ కుమార్, పావని, నికిషా మరియు డీఎస్పీలు రఘు చందర్, రాములు, బార్ కౌన్సిల్ జగిత్యాల అధ్యక్షులు, అలాగే జగిత్యాల జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.