తేది 9- 1- 2026 TSLAWSNEWS సంగారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఉమ్మన్నగారి కృష్ణాగౌడ్.
సంగారెడ్డి జిల్లా:సింగూర్ కాల్వల మరమ్మత్తులు, లైనింగ్ పనులను శరవేగంగా పూర్తి చేసి వచ్చే ఖరిఫ్ కు రైతులకు సాగునీరు అందించాలని మంత్రి అధికారులను అదేశించారు. పెద్దారెడ్డి పేట లిప్ట్ ఇరిగేషన్ పనులపై ఈ సమావేశంలో చర్చించారు. నియోజక వర్గంలో 40 ఏకరాలకు సాగునీరు అందించేలా చేపట్టనున్న పెద్దారెడ్డి పేట లిప్ట్ ఇరిగేషన్ పనుల అంచనాలను వెంటనే రూపోందించి ప్రభుత్వానికి నివేదించాలని మంత్రి అధికారులను అదేశించారు. సింగూర్ ప్రాజేక్టు మరమ్మత్తుల పనులపై మంత్రి చర్చించారు. మరమ్మత్తు పనులను చేపట్టుతున్న సందర్భంగా సింగూర్ ప్రాజేక్టు లో నీటిని వృదా కాకుండా విద్యుత్ ఉత్పత్తి తో పాటు దిగువన ఉన్న ఘన్ పూర్ ఆయకట్టు తో పాటు నిజాం సాగర్ ప్రాజేక్టు ఆయకట్టు కు నీటిని తరలించి రైతులకు ఉపయోగపడేలా చర్యలు చేపట్టాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులను అదేశించారు.
ఈ సమీక్ష లో ENC శ్రీనివాస్ , SE రఘునాథ్, EE భీమ్ గార్లు పాల్గోన్నారు.