ఎస్వీ ఆర్ట్స్ కళాశాల విద్యార్థులపై అత్యంత దారుణంగా దాడి చేసినవారు టీడీపీ విజిలెన్స్ సిబ్బందిలా లేరని.. వైసీపీ వీధిరౌడీల్లా ఉన్నారని టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ అన్నారు. విద్యార్థి జితేంద్ర కుమార్‌ది ఆత్మహత్య కాదని.. ఇది ముమ్మాటికీ వైసీపీ సర్కారు చేసిన హత్యనేనని వ్యాఖ్యానించారు. వైసీపీ నేతల అనుచర గణంతో కలిసి విజిలెన్స్ సిబ్బంది హాస్టల్‌లో చేస్తున్న పెత్తనాన్ని ఎదిరించినందుకే జితేంద్ర కుమార్‌ని అంతం చేశారని అన్నారు. జితేంద్ర కుటుంబానికి రూ.50 లక్షలు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.