మెదక్‌లో బీఎస్పీ పార్టీ సమావేశం – మున్సిపల్ ఎన్నికలు & మాయావతి జన్మదిన కార్యక్రమాలపై కీలక ప్రకటనలు.

తేది:9-01-2026 TSLAWNEWS మెదక్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తోట అభిలాష్.

మెదక్ జిల్లా: బీఎస్పీ పార్టీ కార్యాలయంలో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) ఆధ్వర్యంలో పార్టీ సమావేశం విజయవంతంగా నిర్వహించబడింది.ఈ సమావేశానికి బీఎస్పీ రాష్ట్రఉపాధ్యక్షులు శ్రీరామకృష్ణయ్య, బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ బి. ఈశ్వర్, బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి యాదగిరి, బీఎస్పీ మెదక్ జిల్లా అధ్యక్షులు శ్రీ నాగులూరి స్వామిదాస్, బీఎస్పీ మెదక్ జిల్లా అసెంబ్లీ అధ్యక్షులు గొల్లపల్లి సాయాగౌడ్, జిల్లా ఇన్‌చార్జ్ ప్రభాకర్ గారు మరియు జిల్లా కమిటీ హాజరయ్యారు.

ఈ సమావేశంలో రాబోయే మున్సిపల్ ఎన్నికలపై కీలక నిర్ణయాలు ప్రకటించారు. కౌన్సిలర్‌గా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్న అభ్యర్థులకు బీఎస్పీ పూర్తి మద్దతు ఇస్తుందని, అర్హత కలిగిన అభ్యర్థులకు మద్దతు ఇవ్వడానికి పార్టీ సిద్ధంగా ఉందని నేతలు తెలిపారు.
అలాగే బీఎస్పీ అధినేత్రి బహెన్‌జీ కుమారి శ్రీమాయావతి గారి జన్మదినం జనవరి 15న ఉన్న సందర్భంగా, ఆ రోజున సిద్దిపేటలో ఘనంగా జిల్లా స్థాయి పార్టీ సమావేశం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, బహుజనులు భారీగా హాజరుకావాలని పిలుపునిచ్చారు.
సమాజంలో సమానత్వం, న్యాయం, రాజకీయ సాధికారత కోసం బీఎస్పీ చేస్తున్న పోరాటానికి బలమివ్వడానికి సిద్దిపేటలో జరగనున్న ఈ మహాసభను విజయవంతం చేయాలని పార్టీ నాయకులు కోరారు.
“బహుజనుల ఐక్యతే మా బలం – అందరూ కలసి ఈ మహాసభను చారిత్రాత్మకంగా విజయవంతం చేద్దాం” అని వారు పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *