ముత్తయికోట గ్రామ అభివృద్ధి నా లక్ష్యం.

తేది:9-1-2026 TSLAWNEWS మెదక్ జిల్లా మెదక్ మండలం రిపోర్టర్ శివలింగం ఎల్లం.

మెదక్హ జిల్లా : వెలి ఘనపూర్ మండలం లోని ముత్తయికోట, అభివృద్ధినా లక్ష్యం అని హవెలి ఘనపూర్ మండల సర్పంచ్ ల ఫోరమ్ అధ్యక్షురాలు మెదక్ జిల్లా ఫోరమ్ ఉప అధ్యక్షురాలు కుండారం శ్వేత కిరణ్ కుమార్ గౌడ్ గ్రామ సర్పంచ్ అన్నారు. శుక్రవారం రోజున ముత్తయి కోట గ్రామంలోని భైరవ స్వామి గుడి నుండి మాడబోయిన ఏశవ్వ ఇంటి వరకు బీటి రోడ్డు వెయ్యడం జరిగిందిని మీడియాకు తెలిపారు. ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ముత్తాయి కోట గ్రామానికి కోటి రూపాయల రోడ్డు మంజూరు చేసినందుకు ధన్యవాదములు తెలిపారు.నాకు నా గ్రామస్తులు వార్డు నెంబర్ సభ్యులు సహకారంతో గ్రామ అభివృద్ధి పట్టం కట్టుతామని అన్నారు . గ్రామంలో మౌలిక సదుపాయాలులేమి లేకుండా గ్రామపంచాయతీ అభివృద్ధికి ముందుకు తీసుకువెళ్తామని వెల్లడించారు.ఇదే విధంగా గ్రామ అభివృద్ధిలో ప్రతి పని లో గ్రామస్తులందరూ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *