

తేది:09-01-2026 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి.
జగిత్యాల మున్సిపల్ ఆఫీస్ కు కూతవేటు దూరంలో చెత్త కుప్పలు పేరుకు పోతున్నాయి.జగిత్యాల నుండి గొల్లపల్లి రోడ్ వెళ్ళే రహదారి లో హెచ్ పి పెట్రోల్ బంక్ తాతమ్మ దగ్గర మోతే రోడ్డం వద్ద గత కొన్ని నెలలుగా మున్సిపల్ సిబ్బంది చెత్త కుప్పలు తొలగించట్లేదని స్థానికులు వాపోతున్నారు టీ ఎస్ లా న్యూస్ కథనానికి జగిత్యాల మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించారు.
తాతమ్మ దగ్గర మోతే రోడ్డం వద్దకుప్పలు తెప్పలుగా పేరుకుపోయిన చెత్తను తీసివేసి శుబ్రపరిచారు. వెంటనే స్పందించిన జగిత్యాల మున్సిపల్ అధికారులకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ ప్రాంతంలో బతుకమ్మ పార్కును ఏర్పాటు చేయాలని స్థానికులు మున్సిపల్ అధికారులను కోరుతున్నారు.