సదాశివపేట మార్కెట్ కమిట్ చైర్మన్ ప్రమాణ స్వీకారం చేసిన-మస్క్ అలవేణి నరసింహారెడ్డి.

తేది:09-01-2026 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS సదాశివపేట మండలం క్రైమ్ రిపోర్టర్ బి. ప్రసాద్ గౌడ్.

సంగారెడ్డి జిల్లా: సదాశివపేట పట్టణంలోని బాలాజీ ఫంక్షన్ హాల్ లో శుక్రవారం సదాశివపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా మస్క్ అలవేణి నరసింహారెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు.ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి టీజీఐఐసీ కార్పొరేషన్ చైర్మన్ నిర్మల జయప్రకాశ్ రెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై నూతన చైర్మన్‌ను అభినందించారు. ఈ సందర్భంగా నిర్మల జగ్గారెడ్డి  మాట్లాడుతూ, సదాశివపేట మార్కెట్ కమిటీ పరిధిలో రైతులకు న్యాయమైన ధరలు లభించేలా, మార్కెట్ మౌలిక వసతుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని, వ్యవసాయ మార్కెట్లను ఆధునీకరించి రైతులు, వ్యాపారులకు అన్ని సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తోందని తెలిపారు. అలవేణి నరసింహారెడ్డి నాయకత్వంలో సదాశివపేట మార్కెట్ కమిటీ మరింత అభివృద్ధి సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.అనంతరంనూతన చైర్మన్ అలవేణి నరసింహారెడ్డి మాట్లాడుతూ తనపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, మార్కెట్ అభివృద్ధితో పాటు పారదర్శక పాలన అందిస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇంచార్జ్ జూలకంటి ఆంజనేయులు, సి డి సి చైర్మన్ గడీల రామ్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు గౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు చాట్ల సిద్ధన్న,పట్టణ అధ్యక్షుడు మునిపల్లి సత్యనారాయణ,ఆయా గ్రామాల సర్పంచులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు,నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు, వ్యాపారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *