తేది:09-01-2026 నల్గొండ జిల్లా TSLAWNEWS దేవరకొండ నియోజకవర్గం పులిజాల గోవర్ధన్.
నల్గొండ జిల్లా:డిండి మండలం నిజాం నగర్ గ్రామ మపంచాయతీ నివాసి భూతం భారతిరామకృష్ణ అదే స్కూల్లో చదువుతున్న తన కొడుకు పుట్టినరోజు సందర్భంగా స్కూల్ కి సౌండ్ స్పీకర్ బాక్స్,మౌత్ స్పీకర్ పాఠశాలకు బహుకరించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో తవక్లాపురం కాంప్లెక్స్ హెచ్ఎం సదానందం రావు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు అమరేందర్, ఉపాధ్యాయులు రవి,సి ఆర్ పి రాము, విద్యార్థులు పాల్గొని వారికి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. ఇలాగే మన గ్రామస్తులు అందరూ ముందుకు వచ్చి మన పాఠశాల అభివృద్ధిలో కీలక భాగస్వాములుగా కావాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులు అమరేందర్ కోరారు.పాఠశాలకు బహుమానంగా అందించినందుకు పాఠశాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.