వరంగల్ జిల్లా సమాజాన్ని చైతన్య పరచడంలో (TSJU ) తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్స్ యూనియన్ అభినందనీయం.

తేది:09-01-2026 TSLAWNWES వరంగల్ జిల్లా ఇంచార్జ్ వల్లే ప్రశాంత్

ప్రభుత్వ, సామాజిక, ప్రజా చైతన్య కార్యక్రమాల నిర్వహణలో TSJU ప్రత్యేకం
ప్రతి ఒక్కరూ బాధ్యతగా రోడ్డు భద్రతను పాటించాలి-వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద.

TSJU ఆధ్వర్యంలో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్బంగా అవగాహన ర్యాలీ కార్యక్రమం-పాల్గొన్న DTO శోభన్, ట్రాఫిక్ సిఐ సుజాత, పలువురు పోలీస్ అధికారులు.

వరంగల్ జిల్లా: సమాజాన్ని చైతన్య పరచడంలో (TSJU ) తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్స్ యూనియన్ పాత్ర అభినందనీయమని వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద అన్నారు. శుక్రవారం TSJU రాష్ట్ర అధ్యక్షులు పురుషోత్తం నారగోని ఆదేశాల మేరకు వరంగల్ జిల్లా కమిటీ అధ్యక్షుడు కందికొండ మోహన్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా వరంగల్ చౌరస్తా నుండి పోచమ్మ మైదాన్ సెంటర్ వరకు అవగాహన ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా జిల్లా కలెక్టర్ సత్య శారద, ప్రత్యేక ఆహ్వానితులుగా వరంగల్ డిటిఓ శోభన్, ట్రాఫిక్ సిఐ సుజాత, జాతీయ యువజన అవార్డు గ్రహీత సామాజికవేత్త మండల పరశురాములు, వరంగల్ mro శ్రీకాంత్, ncc కెప్టెన్ సతీష్, ఇంతేజార్గంజ్ సీఐ షుక్రు, మాట్టేవాడ సిఐ కర్ణాకర్, ఎస్సైలు సందీప్, వెంకటేశ్వర్లు, రవికిరణ్, కుమార్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సత్య శారద మాట్లాడుతూ ప్రభుత్వ, సామాజిక, ప్రజా చైతన్య కార్యక్రమాలను నిర్వహించడంలో TSJU తన ప్రత్యేకతను చాటుతూ ఇతర యూనియన్లకు ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. సమాజాన్ని చైతన్యపరచడంలో టీఎస్ జె యు పాత్ర అభినందనీయమని అన్నారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతను బాధ్యతగా ట్రాఫిక్ రూల్స్ ను పాటించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో టీఎస్ జె యు రాష్ట్ర నాయకులు తోకల అనిల్, నాగపురి నాగరాజు, నరేష్, వరంగల్ జిల్లా కమిటీ సభ్యులు బత్తుల సత్యం, కందికొండ గంగరాజు, ఈద శ్రీనాథ్, లింగ బత్తిని కృష్ణ, అడుప అశోక్, నాగపూరి అవినాష్, కౌడగాని మోహన్, నీరుటి శ్రీహరి, మంతెన సురేష్, రావుల నరేష్,వల్లే ప్రశాంత్, 28వ డివిజన్ అధ్యక్షుడు సంపత్ కుమార్, nss కో ఆర్డినేటర్ శ్రీనివాస్, మోటివేటర్ బరుపాటి గోపి, ncc స్టూడెంట్స్, ధ్రువ, పద్మావతి కాళా శాలల విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *