“మార్పు” ఖాయం, సునామీనే – తేల్చేసిన ప్రముఖ జాతీయ సర్వే..!!

తెలంగాణ ఎన్నికల ఫలితాల పై అనూహ్య లెక్కలు బయటకు వస్తున్నాయి. పోలింగ్ ముగిసిన తరువాత వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ లో మెజార్టీ అభిప్రాయం కాంగ్రెస్ కు అనుకూలంగా కనిపించింది. ఈ ఎగ్జిట్ పోల్స్ ను బీఆర్ఎస్ వ్యతిరేకించింది. ఎగ్జాక్ట్ పోల్స్ లో తమదే విజయమని బీఆర్ఎస్ నాయకత్వం స్పష్టం చేస్తోంది. ఈ సమయంలో ఇండియా టూడే యాక్సిస్ మై ఇండియా సంస్థ ఒక రోజు ఆలస్యం బయట పెట్టింది. ఈ సర్వేలో ఆసక్తికర అంశాలను విశ్లేషించారు. కాంగ్రెస్ సునామీ ఖాయమని అంచనా వేసింది.

 

గెలుపు పై ఉత్కంఠ:తెలంగాణలో 119 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ఎవరనేది ఇప్పుడ ఉత్కంఠ పెంచుతోంది. 2018 ఎన్నికల కంటే మూడు శాతం తక్కువగా 70.79 నమోదైంది. పోలింగ్ సరళి అన్ని పార్టీలకు పజిల్ గా మారింది. కాంగ్రెస్ తమ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తోంది. బీఆర్ఎస్ ముఖ్య నేతల సమావేశంలో కేసీఆర్ గెలుపు పైన విశ్వాసం వ్యక్తం చేసారు. ఈ ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా పుంజుకుందని..ప్రత్యర్ది పార్టీల గెలుపు ఓటమలును డిసైడ్ చేస్తోందనే విశ్లేషణలు ఉన్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ వార్ రూమ్ లు పోలింగ్ సరళి గురించి క్షేత్ర స్థాయి సమాచారం సేకరించారు. ప్రతీ నియోజకవర్గంలో పోలింగ్ తీరును విశ్లేషించారు. అంతిమంగా తమకే కలిసి వస్తుందని చెబుతున్నారు.

 

కాంగ్రెస్ సునామీ:ఇండియా టూడే యాక్సిస్ మై ఇండియా సంస్థ వెల్లడించిన లెక్కల ప్రకారం 32 శాతం ప్రజలు కేసీఆర్ సీఎంగా ఉండాలని కోరుకున్నారు. 21 శాతం మంది రేవంత్ వైపు చూస్తున్నారని తేల్చారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ ను తీసుకురావటం బిగ్ మిస్టేక్ గా ప్రజలు భావించినట్లు సర్వేలో వెల్లడించారు. కేసీఆర్ ను ఎదుర్కొనే నేతగా రేవంత్ వైపే పార్టీ చూసిందని విశ్లేషించారు. సీఎం కేసీఆర్ పెద్ద సంఖ్యలో ప్రస్తుత ఎమ్మెల్యేలనే తిరిగి బరిలోకి దించటం పైన ప్రజల్లో వ్యతిరేకత ఉందని వివరించారు. ప్రజలు తమ తీర్పు స్పష్టంగా ఓటు రూపంలో తేల్చి చెప్పారని విశ్లేషించారు. ఉత్తర తెలంగాణలో మూడు పార్టీల ఓటింగ్ షేర్ లో భారీ మార్పు కనిపిస్తుందని సర్వేలో తేలినట్లు వివరించారు. బీఆర్ఎస్ కంచుకోటలో అనూహ్య మార్పు కనిపించిందని వెల్లడించారు.

 

ఎవరికెన్ని సీట్లు:ఇక.. ఓట్ల పరంగా చూస్తే ఈ సర్వే అంచనాల ప్రకారం బీఆర్ఎస్ 36 శాతం ఓట్ షేర్ తో 34-44 సీట్లు, కాంగ్రెస్ 42 శాతం ఓట్ షేర్ తో 63-73 సీట్లు – , బీజేపీ 14 శాతం ఓటింగ్ షేరింగ్ తో 4-8 సీట్లు , ఎంఐఎం3 శాతం తో 6 సీట్లు సాధిస్తాయని అంచనా వేసారు. కాంగ్రెస్ పూర్తి స్థాయిలో కాంగ్రెస్ అధికారానికి కావాల్సిన మేజిక్ ఫిగర్ సొంతంగా సాధిస్తుందని స్పష్టం చేసింది. ఇక విధంగా బీఆర్ఎస్ కంచుకోటల్లొనూ ప్రజలు కాంగ్రెస్ కే పట్టం కట్టారని విశ్లేషించారు. దీని ద్వారా కాంగ్రెస్ సాధారణ విజయం కాదని..ఇది సునామీగా ఈ సర్వే విశ్లేషించింది. గురువారం వెల్లడైన సర్వే అంచనాలకు కొనసాగింపుగా ఈ ప్రముఖ సర్వే వెల్లడించిన అంచనాలు ఎంత వరకు వాస్తవమనేది ఈ నెల 3న వెల్లడయ్యే ఫలితాల్లో స్పష్టత రానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *