మున్సిపల్ ఎన్నికలకు ముందు కీలక పరిశీలన – స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాల్‌ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్.

తేది:9-01-2026 TSLAWNEWS మెదక్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తోట అభిలాష్.

మెదక్ జిల్లా:గురువారం నాడు మెదక్ జిల్లా కేంద్రంలోని వెస్లీ కళాశాలలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాల్‌ను జిల్లా కలెక్టర్ గారు సుదీర్ఘంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మెదక్ ఆర్‌డీఓ శ్రీమతి రమాదేవి గారు, మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్ గార్లు కుడా ఉన్నారు.
స్ట్రాంగ్ రూమ్‌లో బ్యాలెట్ బాక్స్‌లు/ఈవీఎంల భద్రతకు తీసుకుంటున్న చర్యలు, సీసీ కెమెరాల ఏర్పాటు, భద్రతా సిబ్బంది నియామకం, ప్రవేశ–నిష్క్రమణ మార్గాలు, ఫైర్ సేఫ్టీ తదితర అంశాలను కలెక్టర్ గారు సమగ్రంగా పరిశీలించారు. కౌంటింగ్ హాల్‌లో టేబుల్స్ అమరిక, లైటింగ్, గాలి ప్రసరణ, కౌంటింగ్ సిబ్బంది సౌకర్యాలు, మీడియా మరియు అభ్యర్థుల ఏజెంట్లకు ప్రత్యేక ఏర్పాట్లు ఎలా ఉండాలన్నదానిపై అధికారులకు సూచనలు చేశారు.
ఎన్నికల ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా, నిబంధనల ప్రకారం, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా జరగాలన్నదే లక్ష్యమని కలెక్టర్ గారు స్పష్టం చేశారు. భద్రత, సౌకర్యాలు, క్రమబద్ధత విషయంలో ఎలాంటి లోపాలు ఉండకూడదని అధికారులను ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *