తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజేత ఎవరో ఎల్లుండి తేలిపోనుంది. నిన్న జరిగిన పోలింగ్ లో కాస్త తక్కువగా పోలింగ్ శాతం నమోదుకావడంతో అన్ని పార్టీలు నిరాశ చెందాయి. ఎంత భారీగా ప్రచారం చేసినా పోలింగ్ కు వచ్చేసరికి ఓటర్లు నిరాశక్తత ప్రదర్శించడంతో హైదరాబాద్ తో పాటు పలు చోట్ల తక్కువ పోలింగ్ శాతాలు నమోదయ్యాయి. మరికొన్ని చోట్ల మాత్రం భారీగా పోలింగ్ నమోదైంది. దీంతో ఆ లెక్కలన్నీ పరిశీలించి ఇవాళ ఈసీ తుది పోలింగ్ శాతాల్ని విడుదల చేసింది.
ఈసీ విడుదల చేసిన లెక్కల ప్రకారం తెలంగాణ వ్యాప్తంగా 71.34 శాతం పోలింగ్ నమోదైంది.ఇందులో మునుగోడులో అత్యధికంగా 91.89 శాతం పోలింగ్ నమోదైంది. అత్యల్పంగా యాకుత్ పురా నియోజకవర్గంలో 39.6 శాతం పోలింగ్ నమోదైంది. జిల్లాల వారీగా చూసుకుంటే అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 90 శాతం పోలింగ్ నమోదైంది. దాదాపు 80కి పైగా నియోజకవర్గాల్లో 75 శాతానికి పైగా పోలింగ్ నమోదైనట్లు ఈసీ వెల్లడించింది.
telangana records 71.34 polling percentage, ec released final figures
తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య హోరాహోరీ పోరు జరిగినట్లు భావించినా అంతిమంగా ఎగ్జిట్ పోల్స్ మాత్రం క్లారిటీ ఇచ్చేశాయి. నిన్నటి నుంచి వెలువడుతున్న ఎగ్జిట్ పోల్స్ లో కాంగ్రెస్ విజేతగా నిలవబోతున్నట్లు తేలిపోయింది. అయితే పోలింగ్ శాతం మాత్రం గత ఎన్నికలతో పోలిస్తే స్వల్పంగా తగ్గడంతో కాంగ్రెస్ విజయంపై దీని ప్రభావం ఏమేరకు ఉండబోతోందన్న చర్చ జరుగుతోంది. అయితే కాంగ్రెస్, బీఆర్ఎస్ ఇద్దరూ విజయంపై ధీమాగా కనిపిస్తున్నారు.
వాస్తవానికి ఏ ఎన్నికల్లో అయినా పోలింగ్ శాతం పెరిగితే అధికార మార్పిడికి సంకేతంగా భావిస్తారు. పోలింగ్ శాతం తగ్గితే మాత్రం అధికార పార్టీకే మొగ్గు ఉంటుంది. అంటే ఓటర్లు అధికార మార్పిడి కోరుకోవడం లేదనే దానికి ఇది సంకేతమని చెప్తారు. కానీ ఇప్పుడు గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి పోలింగ్ శాతం దాదాపుగా నమోదు కావడంతో ఏం జరగబోతోందన్న టెన్షన్ రాజకీయ పార్టీల్లో పెరుగుతోంది. డిసెంబర్ 3న దీనికి సమాధానం